ఆ ఒక్క ఉదాహరణే అవినీతి లేదని చెబుతోంది

-నిమ్మల రామానాయుడు

Date:19/07/2019

అమరావతి  ముచ్చట్లు:

పోలవరం పనులను తన అనుయాయులకి కట్టబెట్టేందుకే ప్రాజెక్టు పనులు నిలిపివేశారని టీడీఎల్పీ ఉపనేత, నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వాక్ ఔట్ చేయటానికి కూడా మైక్ ఇవ్వని పరిస్థితి ఈ రోజు సభలో తలెత్తిందన్నారు. శుక్రవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటివరకు 71 శాతం పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.పోలవరం నిర్వాసితులకు అప్పట్లో సీఎంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఎకరానికి రూ.1.04లక్షలు ఇస్తే.. చంద్రబాబు రూ.6 లక్షలు పైనే ఇచ్చారని గుర్తుచేశారు.
కాళేశ్వరానికి క్యూబిక్ మీటర్కు ఖర్చు రూ.7 వేలు ఉంటే పోలవరానికి రూ.2వేలు మాత్రమే ఉందని ఆయన వివరించారు. పోలవరంలో అవినీతి జరలేదనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని నిమ్మల అన్నారు.

ఎంత దోచారో 15 రోజుల్లో బయటికొస్తాయ్

Tags: One such example says that there is no corruption

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *