కొవిడ్ నుంచి కోలుకుని ఒక్కరు డిశ్చార్జ్    

–  జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్

Date:02/06/2020

కడప ముచ్చట్లు:

కోవిడ్ నుంచి  సంపూర్ణంగా కోలుకున్న ఒక్కరిని  కడప ఫాతిమా కోవిడ్ ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ అయినట్లు  జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్  ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలలోకి వెళ్తే  ఉత్తరప్రదేశ్ కు చెందిన 30 సం. పురుషుడు  కోవిడ్ నుంచి సంపూర్ణంగా కోలుకోవడంతో  ఫాతిమా కోవిడ్ ఆసుపత్రి కడప నుంచి డిశ్చార్జి చేసినట్లు ఆయన తెలిపారు.  దీంతో   ఇప్పటి వరకు మొత్తం 109 మందిని డిశ్చార్జి చేయడం జరిగిందన్నారు.  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి రూ.2000లు ఆర్థిక సాయం, పండ్లు, డ్రైఫ్రూట్స్ ను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం , వైద్యులు నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తూ…  ఆత్మ విశ్వాసంతో కరోనా వైరస్ ను జయించి ఆరోగ్య వంతులుగా వెళుతున్న  వారికి  అధికారులు,  వైద్యులు, నర్సులు  సాదరంగా వీడ్కోలు పలికారు.

ఎస్బీఐ బ్యాంక్ లో అగ్నిప్రమాదం

Tags: One was recovered from Kovid and discharged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *