తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డు తిరుపతి వారు తీర్పును వెల్లడించారు. మెరుగైన ఫలితాలను ఇస్తున్న ప్రయారిటి PT కేసుల (కన్వెన్షన్ బేస్డ్ పోలీసింగ్) విధానం. కేసు నిరూపణకు విశేష కృషిచేసిన తిరుపతి రూరల్, పీపీ లను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., అభినందించారు. తప్పు చేసిన వారు చట్టం నుండి తప్పించుకోలేరని మరోసారి నిరూపించిన తిరుపతి జిల్లా పోలీసులు.తిరుపతి జిల్లాలోని పోలీసు అధికారులకు ముఖ్యమైన కేసులను ప్రయారిటీ PT కేసులుగా పరిగణించి డిఎస్పీ స్థాయి అధికారులకు ఐదు గ్రేవ్ కేసులు, సీఐ స్థాయి అధికారులకు ఆరు నాన్ గ్రేవ్ కేసులు, ఎస్సై స్థాయి అధికారులకు 10 సాధారణ కేసులను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., విభజించి అప్పగించడం జరిగింది.ఇలాంటి కేసులు నేర నిరూపణకు తగిన ప్రాథమిక, భౌతిక, సాంకేతిక సాక్షాదారాలను సేకరించి కోర్టు నందు మెజిస్ట్రేట్ గారికి సమర్పించి నేర నిరూపణ చేయాలనే ఉద్దేశ్యంతో కోర్టు మానిటరింగ్ సిస్టం ను ఇదివరకే ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు.
కేసు వివరాలు:
దొంగతనం కేసులో బాల నేరస్తుడికి ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష,తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో Cr.112/2023 u/s 379 or 411 IPC JJB గా నమోదైన దొంగతనం కేసులో నేరము రుజువై చిత్తూరుకు చెందిన బాలుడు కు u/s 18(1)(g) జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం దోషిగా నిర్ధారించబడింది మరియు 1 సంవత్సరం సాధారణ జైలు శిక్ష ను విధిస్తూ, జువెనైల్ జస్టిస్ బోర్డు తిరుపతి వారు సోమవారం నాడు తీర్పును వెలువరించారు.నేరం చేసిన వారికి శిక్ష పడేలా చేసినప్పుడే బాధితులకు పూర్తి న్యాయం చేసిన వారు అవుతామని, అప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజలకు సదాభిప్రాయం కలుగుతుందని, దీని కొరకు మనమందరం సమిష్టిగా కష్టపడి పని చేసి, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేయాలని, దీని కొరకే ప్రతి శనివారం పోలీసు ఉన్నతాధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో పెండింగ్లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించి, కేసులకు తగినట్లు కార్యచరణ చేసే ఒక ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంది.ఇందులో భాగంగా అహర్నిశలు కృషిచేసిన దర్యాప్తు అధికారులు, తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది మరియు కోర్టు మానిటరింగ్ సిస్టం సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., అభినందించి, అన్ని కేసులలో కూడా ఇలానే ముందుకు వెళ్లి బాధితులకు న్యాయం చేస్తూ నేరస్తులకు శిక్ష పడేటట్లు పనిచేయాలని సూచించారు.
Tags:One year simple imprisonment for juvenile offender in case of theft.