ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌ మెగా డీల్‌

ONGC HPCL mega deal

ONGC HPCL mega deal

సాక్షి

Date :22/01/2018

సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ సంస్థల్లో  ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణల  వ్యూహంలో  మెగా మెర్జర్‌కు పునాది పడింది. ముఖ్యంగా  2018 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకునే లక్ష్యంలో భాగంగా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్‌ లో మెగా డీల్‌ కుదిరింది. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో  (హెచ్‌పీసిఎల్) లో ప్రభుత్వం  మొత్తం వాటాను కొనుగోలు  చేసేందుకు  ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఒఎన్‌జీసీ)  ఆమోదం తెలిపింది. అంతేకాదు గతంలో ప్రకటించిన 25 వేలకోట్ల రూపాయల ఆఫర్‌ను 35వేల కోట్ల రూపాయలకు పెంచి మరీ ప్రభుత్వ వాటాను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు బోర్డు ఆమోదం లభించిందని  ఓఎన్‌జీసీ చైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ శశి శంకర్  తెలిపారు.

ఈ డీల్‌ భాగంగా మొత్తం 51.11 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఒఎన్‌జీసీ అంగీకరించింది. ఇందుకు రూ. 36,915 కోట్లను చెల్లించనున్నామని  ఓఎన్‌జీసీ వర్గాలు  రెగ్యులైటరీ ఫైలింగ్‌లో ప్రకటించాయి.  మొత్తం నగదు రూపంలో జరిగే  ఒప్పందం ఈ నెలాఖరుకు  పూర్తికానుందని,  ఒక్కో షేరుకు రూ. 473.97 చొప్పున ప్రభుత్వానికి చెల్లిస్తామని ఓఎన్‌జీసీ తెలిపింది. ఈ డీల్ ప్రభావంతో ఓఎన్‌జీసీ కౌంటర్‌ భారీగా లాభపడుతోంది. ఇన్వెస్టర్ల  కొనుగోళ్లతో 4.93 శాతం లాభంతో  ట్రేడవుతోంది. మరోవైపు  హెచ్‌పీసీఎల్‌   2 శాతం  నష్టపోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *