కొనసాగుతున్న దస్తావేజు లేఖర్ల నిరసన
ఏలూరు ముచ్చట్లు:
జిల్లాలో రెండవరోజు దస్తావేజుల లేఖర్ల పెన్ డౌన్ నిరసన కార్యక్రమం కొనసాగింది. రెండురోజులుగా ఏలూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తం గా రిజిస్ట్రేషన్ ల ప్రక్రియ ముందుకు కొనసాగలేదు. దాంతో ఆస్తుల అమ్మకం దారులు, కొనుగోలు దారులు అయోమయంలో వున్నారు. ఇంటర్నెట్ సిగ్నల్స్ అందక కంప్యూటర్ లలో స్క్రీన్ పై కొత్త యాప్ చక్కర్లు కొడుతున్నదని సమాచారం. లేఖర్ల పెన్ డౌన్ వల్ల రిజిస్ట్రార్ కార్యాలయాలు బోసిపోయాయి. రిజిస్ట్రేషన్ లు ఆగిపోయాయి.
Tags: Ongoing deed writers protest

