యూపీలో కొనసాగుతున్న పరువు హత్యలు

Date:18/11/2019

లక్నో ముచ్చట్లు:

ఉత్తర్‌ప్రదేశ్‌లో పరువు హత్య కలకలం రేపింది. పక్కింటి యువకుడిని ప్రేమిస్తున్న యువతి కన్నతండ్రి చేతిలోనే దారుణహత్యకు గురైంది. ఫిరోజాబాద్‌కు చెందిన హరివంశ్‌ కుమార్‌ అనే వ్యక్తికి ఐదుగురు సంతానం. వీరిలో చిన్నదైన పూజ(22) పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతోంది. ఈ క్రమంలోనే పక్కింట్లో ఉండే గజేంద్ర యువకుడితో ప్రేమలో పడింది. గజేంద్ర తన సామాజిక వర్గానికే చెందిన వాడైనప్పటికీ పూజ అతడిని ప్రేమించడం కుమార్‌కు నచ్చలేదు. దీంతో పద్ధతి మార్చుకోవాలని కూతురిని అనేకసార్లు హెచ్చరించాడు.శనివారం గజేంద్రతో పూజ మాట్లాడటాన్ని చూసిన ఆమె తండ్రి కోపోద్రిక్తుడయ్యాడు. కుమార్తెను ఇంట్లోకి లాక్కెళ్లి కరెంట్ షాకిచ్చాడు. బాధతో విలవిల్లాడుతున్న కూతురి గొంతు కోసేశాడు. ఆ సమయంలో కుటుంబసభ్యులెవరూ ఇంట్లో లేకపోవడంతో ఆమెను కాపాడలేకపోయారు. దీంతో తీవ్ర రక్తస్రావమైన పూజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కొంత సమయానికి ఇంటికి వచ్చిన పూజ తల్లి, సోదరుడు దారుణాన్ని చూసి చలించిపోయారు.పూజ అన్నయ్య యోగేశ్ ఫిరోజాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కుమార్ తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పూజ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం ఆస్పత్రికి తరలించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల పరువుహత్యలు పెరిగిపోతున్నాయి. బిడ్డలు తమకు ఇష్టం లేకుండా ప్రేమపెళ్లిళ్లు చేసుకోవడాన్ని తట్టుకోలేకపోతున్న కన్నవారు వారిని దారుణంగా చంపేస్తున్నారు. యూపీలో గత 18 నెలల్లో 23 పరువుహత్యలు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

 

తెలుగు భాషపై లోక్ సభలో చర్చ

 

Tags:Ongoing defamation killings in UP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *