కొనసాగుతున్న డాక్యుమెంటర్ రైటర్ల హవా

Date:21/02/2020

నెల్లూరు ముచ్చట్లు:

ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకువచ్చే శాఖల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఎంతో ప్రముఖమైనది.తిరిగి గత నెల రోజుల నుండి జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. అయితే ప్రభుత్వాదాయానికి హెచ్చుతగ్గులు ఉంటున్నప్పటికి సిబ్బంది ఆదాయంలో హెచ్చు తప్ప తగ్గుదల కనిపించడం లేదు. మామూళ్లు ఇస్తేనే పనులు జరుగుతాయనే భావన రిజిస్ట్రేషన్ కోసం వచ్చేవారిలో ఏర్పడిపోయింది. ప్రస్తుతం జిల్లాలో గూడూరు, నెల్లూరు రిజిస్ట్రేషన్ జిల్లాలుగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. నిత్యం వివిధ ఆస్తులు, ఇతర విషయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారితో ఈ కార్యాలయాలు కిటకిటలాడుతుంటాయి.

 

 

 

అయితే డాక్యుమెంట్ వాల్యూలో 5 శాతం వరకు కార్యాలయ సిబ్బందికి లంచం ఇవ్వనిదే రిజిస్ట్రేషన్ పూర్తికాదని ముందుగానే క్లయింట్లకు చెబుతారు. ఇందులో కార్యాలయ సిబ్బందికి ఎంతిస్తారో, వారెంత తీసుకుంటారో లోగుట్టు పెరుమాళ్లకెరుక. ఒకవేళ మామూళ్లు ఇచ్చేందుకు నిరాకరిస్తే వారి డాక్యుమెంట్లో అధికారులకు సాంకేతిక తప్పులు తప్ప మరేమీ కనిపించని పరిస్థితి. దీంతో ఎందుకొచ్చిన గొడవనుకునేవారు డాక్యుమెంట్ రైటర్లు చెప్పిన మొత్తం ఇచ్చి తమ పని పూర్తిచేసుకుని వెళుతున్నారు. జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిస్థితి ఇలానే ఉందని చెప్పలేకపోయినా ఎక్కువచోట్ల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.రూరల్‌లో తిరుగులేని రైటర్లు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంటు రైటర్లకు తిరుగుండడం లేదు.

 

 

 

అల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏ చిన్న పని జరగాలన్నా అక్కడి కొందరు డాక్యుమెంటు రైటర్లనే నమ్ముకోవాల్సి వస్తుంది. ఇక్కడి రైటర్లు కార్యాలయ సిబ్బంది పేరుతో సాధారణంగా తీసుకునే 5 శాతానికి మరో 5 శాతం కలిపి తమ మామూళ్లుగా తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక రాజకీయ నేతలతో ఉన్న సాన్నిహిత్యం రీత్యా వీరిని ప్రశ్నించేవారు కూడా లేరు. గతంలోనూ జిల్లా అధికారులు అల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల హవాపై సిబ్బందికి గట్టిగా హెచ్చరికలు కూడా చేసినట్లు సమాచారం.

రాజకీయాలకు దూరంగా ఆదినారయణరెడ్డి

Tags: Ongoing Documentary Writers Hawa

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *