జూరాలకు కొనసాగుతున్న వరద నీరు

మహబూబ్ నగర్  ముచ్చట్లు:
జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం  కొనసాగుతున్నది.  ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టులో గేట్ల మరమ్మతు కారణంగా నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి జూరాల ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చిచేరుతున్నది.  ప్రాజెక్టులో ప్రస్తుతం 318.420 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ఉన్నది. నీటి నిల్వ 9.459 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు.  కాగా, ఎగువనుంచి 20,239 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 7,484 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తారు. ఇందులో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 5,070 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Ongoing flood water for Jura

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *