కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం ముచ్చట్లు:
వాయువ్య బంగాళాఖాతం లో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణం కేంద్రం  వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడి, ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశలో కదిలే అవకాశం వుందని పేర్కోంది. వేగంగా కదులుతున్న  నైరుతి ఋతుపవనాలు  ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు,  దక్షిణ గుజరాత్, దక్షిణ మధ్యప్రదేశ్ , ఛత్తీస్గఢ్  మరియు ఉత్తర బంగాళాఖాతంలోని ప్రాంతాలకు విస్తరించింది.  ఉత్తర కోస్తాంధ్ర లో రాగల 48 గంటల్లో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, జల్లులు చాలా చోట్ల   మరియు  భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది మరియు భారీ నుంచి అతి భారీ వర్షాలు శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడా  కురిసే అవకాశం వుంది. దక్షిణ కోస్తాఆంధ్రా ప్రాంతంలో  తేలికపాటి  వర్షాలు,ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం వుంది. రాయలసీమలో  తేలికపాటి వర్షాలు, ఒకటి రెండుంచోట్ల  మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్ర తీరం వెంబడి 40-50 కి.మీ వేగంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం వుందని తెలిపింది. మత్స్య కారులు చేపల వేటకు వెళ్ళొద్దని ఆదేశాలు,  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణం కేంద్రం హెచ్చరికలు జారీచేసింది..

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Ongoing hypotension

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *