రైస్ మిల్లులపై కొనసాగుతున్న ఐటి దాడులు

మిర్యాలగూడ ముచ్చట్లు:

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని రైస్ మిల్లులపై ఐటి దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి. గత నెలలో.. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పలు రైస్ మిల్లులతోపాటు.. మిల్లర్ ఓనర్ల ఇళ్లలోనూ దాడులు జరిగిన విషయం తెలిసిందే. గతంలో.. అధికార బీఆర్ఎస్ పార్టీ కాంట్రాక్టర్ ఇంటిపై వరస దాడులు జరిగాయి. -అప్పట్లో.. 8 కోట్ల నగదు సహ కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. నెల రోజుల వ్యవధిలోనే.. మళ్లీ ఐటీ అధికారుల దాడులు కలకలం రేపాయి. మిర్యాలగూడలోని సాగర్ రోడ్డు, ఖమ్మం రోడ్లలో గల రైస్ మిల్లులపై ఏకకాలంలో దాడులు జరిగాయి. ఆరు బృందాలుగా ఏర్పడి.. గురువారం మధ్యాహ్నం నుండి సూర్య, సాయి జయలక్ష్మి, వైష్ణవి, సాంబశివ,ఆర్ ఎస్వి రైస్ రైస్ మిల్లులో విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు.
రైస్ మిల్లుల్లో రికార్డులు తనిఖీలు.. బ్యాంకు లావాదేవీలు ధాన్యం కొనుగోలు రికార్డులను పరిశీలిస్తున్నారు.

Tags: Ongoing IT attacks on rice mills

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *