కొనసాగుతున్న ఐటీ సోదాలు

Date:06/10/2018
విశాఖపట్నం ముచ్చట్లు:
శనివారం కుడా పలు సంస్థలపై ఐటీ సోదాలు  కొనసాగాయి. శుభగృహ, ఎన్ ఎస్ ఆర్ హౌసింగ్ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేసారు.  శుక్రవారం ప్రారంభమయిన సోదాలు శనివారం కుడా కొనసాగడం విశేషం. ఆయా కార్యాలయాల్లో దొరికిన పత్రాలతో పాటు కంప్యూటర్ లో చిట్టాలను తనిఖీ చేస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలు, ఐటీ చెల్లింపులపై ఆరా తీసిసట్లుసమాచారం. భూములు మార్కెట్ వ్యాల్యూ కు, రిజిస్టర్ వ్యాల్తూకు మధ్య భారీ వ్యత్యాసం గుర్తించినట్లు కూడా సమాచారం. డాక్యుమెంట్స్ పై రిజిస్టర్ వ్యాల్యూ తక్కువ చూపినట్టు  అధికారుల పరిశీలన లో తేలింది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టినట్టారని అధికారుల అనుమానిస్తున్నారు. ఆదాయపు పన్నుతోపాటు జీఎస్టీ పత్రాలనూ అధికారులు పరిశీలించారు.
Tags:Ongoing IT searches

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed