నిర్విరామంగా కొనసాగుతున్న N.V.R ట్రస్ట్ సేవాకార్యక్రమాలు
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు మండలం, చదళ్ల గ్రామానికి చెందిన ఎన్ వేణుగోపాల్ రెడ్డి యొక్క సేవా కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో నిర్విరామంగా కొనసాగుతున్నా యి. అనేక పురాతన ఆలయాలకు విరాళాలు ఇవ్వడమే కాకుండా చాలామంది నిరుపేదల ఆరోగ్యం కొరకు కూడా తమవంతు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది .వాటిలో భాగంగానే, పంజాని మండలం ఆకులవారి పల్లి లో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ నిర్మాణం కొరకు 15 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా, చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామంలో పురాతన బాబా మసీద్ అభివృద్ధి కొరకు 13 వేల రూపాయలు, అదే గ్రామంలో ఓ మైనార్టీ మహిళ వివాహం కొరకు 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది,చౌడేపల్లి మండలం కొలింపల్లి గ్రామంలో హరిప్రసాద్ కుమార్తె ఆరోగ్యం కోసం 10 వేల రూపాయలు,పుంగనూరు మండలం బండ్లపల్లి గ్రామం లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ గంగమ్మ ఆలయ నిర్మాణం కొరకు 10 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది.అదేవిధంగా చౌడేపల్లి మండలం చింతమాకులపల్లి లో ఇటీవల ప్రమాదం లో మరణించిన కళాకారుడు నాగరాజ కుటుంబం ని పరామర్శించి 10 వేల రూపాయలు అందజేయడం జరిగింది.ఈ సంధర్భంగా వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ మా ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయి అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో NVR ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, నారాయణ రెడ్డి,జయపాల్ రెడ్డి, రవి కుమార్,సందీప్ రెడ్డి, కిషోర్ రెడ్డి, మహేష్ రెడ్డి, చిట్టి మరియు మిత్రులు పాల్గొన్నారు.

Tags: Ongoing N.V.R Trust Service Programmes
