కొనసాగుతున్న విద్యుత్ వివాదం

కర్నూలు  ముచ్చట్లు:
సాగునీటి ప్రాజెక్టులలో విద్యుత్‌ ఉత్పత్తికి సంబంధించి చెలరేగిన వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రాజెక్టులలో సరిపడా నీరు లేనప్పుడే విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించడంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాన్ని తెలంగాణ సర్కారు బేఖాతరు చేసింది. గురువారం నాడు కూడా కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల నుండి విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద పెద్దఎత్తున పోలీసులను మోహరింపచేశాయి. సాధారణ ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు విడివిడిగా లేఖ రాశారు. విద్యుత్‌ ఉత్పత్తికోసం తెలంగాణ అక్రమంగా వాడుకున్న నీటిని నిలుపుదల చేయాలని, కృష్ణా బోర్డు పరిధిలో ఉన్న అన్ని ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేయాలని ఈ లేఖల్లో కోరారు.  అంతకుముందు శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల వద్ద రెండు రోజుల నుండి చేస్తున్న విద్యుత్‌ ఉత్పత్తిని గురువారం నాడు కూడా తెలంగాణ ప్రభుత్వం కొనసాగించింది. దీంతో నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులకు చెందిన ఆంధ్రప్రదేశ్‌ అధికారులు విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేయాలని కోరుతూ తెలంగాణా అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద ఎస్‌ఇ రమేష్‌బాబు నుండి తెలంగాణ జెన్‌కో అధికారులు వినతిపత్రం తీసుకున్నారు. నాగార్జున సాగర్‌ వద్ద ఎపి అధికారులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు ఎస్‌ఇ గంగరాజు, ఆర్‌డిఓ పార్థసారధి, డిఎస్‌పి ప్రసాద్‌లనుంచి వినతిపత్రం తీసుకోవడానికి టి. జెన్‌కో అధికారులు నిరాకరించడంతో ఆ రాష్ట్ర పోలీసులు వీరిని వెనక్కి పంపారు. తానొక్కడినే వెళ్లి వినతిపత్రం ఇస్తానని చెప్పినా తెలంగాణ అధికారులు ఒప్పుకోలేదని, ఫ్యాక్స్‌ ద్వారా పంపమని చెప్పారని ఎస్‌ఇ గంగరాజు మీడియాకు చెప్పారు. ఆ తరువాత కూడా ప్రాజెక్టుల నుండి విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగింది.ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ జూరాల ప్రాజెక్టు వంతెనపై రాకపోకలను తెలంగాణ పోలీసులు నిషేధించారు. గద్వాల, ఆత్మకూరు, మక్తల్‌ మధ్య కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, రాజోలు బండ డైవర్షన్‌ స్కీమ్‌ వద్ద ఎపి పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుల వద్ద ఎవరు గుమికూడరాదని కర్నూలు ఎస్‌పి ఫకీరప్ప హెచ్చరించారుపులిచింతల ప్రాజెక్టు వద్ద  మరో వివాదం తలెత్తింది. బ్యారేజి పదవ గేటు వద్ద తెలంగాణ రాష్ట్ర పోలీసులు బ్యారికేడ్లు పెట్టి సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనిని బ్యారేజి అధికారులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. బ్యారేజి నిర్వహణ బాధ్యత పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిదేనని, ఎటువంటి హక్కు లేకుండా బ్యారికేడ్లు పెట్టడం పనులకు ఆటంకం కలిగించడమేనని పులిచింతల ఇఇ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. పోలీసులను వెనక్కి పిలవాలని తెలంగాణ అధికారులను కోరినట్టు ఆయన చెప్పారు.

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags:Ongoing power dispute

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *