కొనసాగుతున్న ఆర్డీఎస్ అక్రమ నిర్మాణ పనులు.. అలంపూర్ రైతాంగంలో ఆందోళన

అమరావతి  ముచ్చట్లు :
ఆర్డీఎస్ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యతరం పెడుతున్నా… ఆంధ్రప్రదేశ్ సుమారు రూ. 2వేల కోట్లతో కాలువ నిర్మాణ పనులు చేపట్టింది. ఇందులో భాగంగా స్ట్రక్చర్ కెనాల్ పనులు ముమ్మరం చేసింది. ఈ ఏడాది రైతులకు ఆర్డీఎస్ కుడి కాలువ ద్వారా సాగునీరు అందించేందుకు ఏపీ ప్రభుత్వం పనులు చేస్తోంది. బ్రిజేస్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అంటూ వితండ వాదం చేస్తూ నాలుగు టీఎంసీల నీటిని  160 కి.మీ. గ్రావిటి కాలువ ద్వారా 40 వేల ఎకరాల ఆయుకట్టుకు తరలించాలని భావిస్తోంది. నాలుగు లిఫ్టులు ఏర్పాటు చేసి అదనంగా మరో 5 లక్షల ఎకరాలకు అక్రమంగా నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా కాలువ నిర్మాణం చర్యలు చేపట్టింది. ఈ కెనాల్ నిర్మాణంతో తెలంగాణలోని 87వేల ఎకరాల ఆయుకట్లు ఉనికి ప్రమాదకరంగా మారనుంది. ఈ విషయంపై ఆర్డీఎస్ తెలంగాణ ప్రాంత రైతాంగం గత నాలుగు నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నా తెలంగాణ సర్కార్ ఏపీతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని అలంపూర్ రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది.

 

భర్తను కొట్టి చంపిన భార్య

Tags:Ongoing RDS illegal construction work .. Concern among Alampur farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *