కొనసాగుతున్న విఆర్ఏల నిరసనలు
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మంలో విఆర్ఎలు నిరసనలు కొనసాగుతున్నాయి.విఆర్ఏల అద్యక్షుడు మస్కుల శివ కుమార్ మాట్లాడుతూ ఎన్నో సంవ్సరాలుగా గ్రామాలలో చాలి చాలని వేతనాలతో 24 గంటలు ప్రజలకు, రైతులకు సేవలు అందిస్తున్న విఆర్ఎల పేరు మారింది కానీ బానిసబ్రతుకులు మారలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విఆర్ఏలకు 10500 గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారని, ఈ వేతనం కుటుంబ పోషణకు భారం అవుతుందని అప్పులు చేయాల్సి వస్తుంది అని పేర్కొన్నారు, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతిభవన్, అసెంబ్లీ సాక్షిగా పేస్కేల్, పదోన్నతులు, వారసులకు ఉద్యోగాలు కల్పస్తామని హమిలు ఇచ్చి ఐదున్నర సంవస్సరాలు అయిన మోక్షం లభించలేదు అని ఆవేదన వ్యక్తంచేసారు.

Tags: Ongoing VRA protests
