35 రూపాయిలకే ఉల్లి

Date:24/10/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

నిన్న మొన్నటివరకు టమాటా సెంచరీ కొట్టింది. అది కాస్త తగ్గిందనుకుంటే.. ఇప్పుడుటామాట బాట‌లో ఉల్లి చేరింది. ఆనియ‌న్ అంద‌నంటోంది. ఉల్లి ధ‌ర మార్కెట్ లో మంట పుట్టిస్తున్నాయి. కొన‌కొండానే… కోయ‌కుండానే… కంట‌నీరు తెప్పిస్తోంది. ఉల్లిధరలు మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లలో ధరలు అనూహ్యంగా పెరగడం రిటైల్ మార్కెట్లపై పెనుభారం మోపుతోంది. ప్రస్తుతం కిలో ఉల్లి రేటు రూ.100 దాటింది. మార్కెట్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో మొన్నటి వరకు ఠారెత్తించిన ధరలతో పాటు.. ప్రస్తుతం ఉల్లి ఘాటుకు సామాన్యులు సతమతమవుతున్నారు.ఉల్లి ధరల నియంత్రణ కోసం పలు రాష్ట్రాల మార్కెటింగ్ శాఖలు ధరలపై ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో రూ. 35కే కిలో ఉల్లిగడ్డలు విక్రయిస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. నేటి నుంచి రైతుబజార్లలో ఉల్లి విక్రయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జంట నగరాల్లోని 11 రైతుబజార్లలో ఉల్లిని అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున ఉల్లిని విక్రయిస్తామన్నారు. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఉల్లిని కొనుగోలు చేయొచ్చు అని తెలిపారు. భారీ వర్షాలకు దేశ వ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతిన్నదని చెప్పారు. లాభం లేకుండా రవాణా ఖర్చులను దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు జరుపుతున్నామని పేర్కొన్నారు.చాలా చోట్ల కిలో ఉల్లి ధర రూ. 100కు చేరుకుంది. కడప జిల్లాలో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి‌. నెలరోజుల క్రితం రూ. 25 ఉన్న ఉల్లి ధర… ప్రస్తుతం ధర మంట పుట్టిస్తోంది. కిలో ఉల్లి రూ. 80 నుంచి రూ.90లకు పలుకుతోంది. ఈ ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అటు ఏపీలో కూడా ఉల్లిధరలు కట్టడి చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. కిలో ఉల్లి కేవలం రూ. 45 మాత్రమే విక్రయించాలని అధికారులు నిర్ణయించారు.

రెండు అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం 

Tags: Onion for only 35 rupees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *