బంగ్లాదేశ్‌ లో రూ.220కి చేరిన కిలో ఉల్లి ధర

Onion price in Bangladesh reaches Rs

Onion price in Bangladesh reaches Rs

* భారత్‌ నుంచి బంగ్లాకు ఉల్లి దిగుమతి బంద్‌

* టర్కీ, ఈజిప్ట్‌, చైనా నుంచి బంగ్లా ఉల్లి దిగుమతి

* ధరలు తగ్గించేందుకు చర్యలు

Date:18/11/2019

బంగ్లాదేశ్‌ ముచ్చట్లు:

భారత్‌ లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతోన్న నేపథ్యంలో.. భారత్‌ నుంచి ఉల్లి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్‌లో కిలో ఉల్లిపాయల ధర రూ.220 కు చేరింది. దీంతో ఆ దేశ ప్రభుత్వం విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్‌, చైనా ల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటూ ఉల్లి ధరలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. పలు ప్రాంతాల్లో ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి కిలో ఉల్లి రూ.38కి అందించే ప్రయత్నాలు చేస్తోంది. ఉల్లి ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో తన నివాసంలో ఉల్లి వాడొద్దని బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసినా నిర్ణయం తీసుకున్నారు. భారత్‌ లోని పలు ప్రాంతాల్లో ఉల్లి కిలో రూ.70 కి చేరిన నేపథ్యంలో.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో ఈ పరిస్థితి వచ్చింది.

 

అగ్రిగోల్డ్ తరహాలో తమనూ ఆదుకోవాలని ”అభయ గోల్డ్ బాధితుల వినతి

 

Tags:Onion price in Bangladesh reaches Rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *