రూ.2 కు పడిపోయిన ఉల్లి ధర

Onion prices fall to Rs

Onion prices fall to Rs

Date:24/11/2018
కర్నూలు ముచ్చట్లు:
ఉల్లి ధర కిలో రూ.2కు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్‌లో వ్యాపారులు గురువారం రైతుల నుంచి కింటాలు ఉల్లిని రూ.200కు కొనుగోలు చేశారు. ధర ఒక్కసారిగా పడిపోవడంతో ఉల్లిరైతులు డీలా పడ్డారు. అప్పు చేసి పంట సాగుచేస్తే చివరకునష్టాలు వచ్చాయని వాపోయారు. ధర అమాంతం పడిపోవడంతో లారీల బాడుగ కూడా రాని పరిస్థితి నెలకొందని భోరుమన్నారు. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లో బోరు బావుల కింద దాదాపు 25 వేల ఎకరాల్లో రైతులు ఈసారి ఉల్లి పండించారు. ఇక్కడి పంటను ఎక్కువగా కర్నూలు, హైదరాబాద్, విజయవాడ, చెన్నైకి తరలిస్తుంటారు. కొంతమంది రైతులు ఆదోని మార్కెట్‌లోనే విక్రయిస్తుంటారు. నాలుగు నెలల క్రితం క్వింటాల్ రూ.1000 నుంచి, రూ.1200 వరకు ధర పలికింది. అయితే ఆ తరవాత ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది. గురువారం ఒక్కసారిగా క్వింటాల్ రూ. 200కు పడిపోయింది. కాస్త పెద్ద గడ్డలు రూ.500 వరకు పలికాయి. ఉల్లి ధర తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
Tags:Onion prices fall to Rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *