ఫిబ్రవరి 16న ఉదయం 9.30 గంటలకు ఆన్లైన్లో విరాళాల స్వీకరణ ప్రారంభం

-చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం విరాళాలు ఆహ్వానం
-రూ. కోటి విరాళం ఇస్తే ఒక ఉదయాస్తమాన సేవా టికెట్ మంజూరు
 
తిరుమల ముచ్చట్లు:
 
తిరుపతిలో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం టిటిడి దాతల నుండి విరాళాలు ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ఫిబ్రవరి 16న బుధవారం ఉదయం 9.30 గంటలకు ఆన్లైన్లో విరాళాల స్వీకరణ ప్రారంభం కానుంది. https://tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా దాతలు విరాళాలు సమర్పించవచ్చు.పలు కారణాల వల్ల ఇప్పటివరకు ఖాళీ అయిన 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను దాతలకు అందుబాటులో ఉంచడమైనది. ఇందుకోసం వారంలో శుక్రవారం నాటికైతే రూ.1.50 కోట్లు, మిగిలిన రోజుల్లో అయితే ఒక కోటి రూపాయలను దాతలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా పారదర్శకంగా ఈ సేవా టికెట్ల కేటాయింపు జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ కోరింది.
 
Tags: Online acceptance of donations will begin on February 16 at 9.30am

Leave A Reply

Your email address will not be published.