గురుకులాల‌కు ఆన్ లైన్ లో  క్లాసులు

Date:05/09/2020

నిజామాబాద్‌ ముచ్చట్లు:

కరోనా మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థుల చదువులు అగమ్యగోచరంగా మారాయి. కరోనా కరుణ చూపే వరకు పాఠశాలల పున:ప్రారంభం కత్తిమీద సాము లాగే తయారైంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మేధావులు కూడా ఇప్పటికిప్పుడే పాఠశాలలను పున:ప్రారంభించరాదని సూచించారు. పరీక్షలు నిర్వహిస్తే ఎక్కడ కరోనా విస్తరిస్తుందోననే భయంతో ప్రభుత్వం ఇప్పటికే గతేడాది ఒకటో తరగతి నుంచి  పదో తరగతి వరకు పరీక్షలు లేకుండానే విద్యార్థులందరిని పాస్‌ చేసేసింది. ఇదిలా ఉండగా ఈసారి ఇటు విద్యా సంవత్సరం నష్టపోకుండా, అటు విద్యార్థులు చదువులకు దూరం కాకుండా ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపడుతోంది. మొదట ఆన్‌లైన్‌ విద్యాబోధన చేయాలనుకున్న ప్రభుత్వం విద్యార్థులందనికీ వద్ద స్మార్ట్‌ ఫోన్, ఇంటర్నెట్‌ సౌకర్యం ఉండదని భావించి దూరదర్శన్‌ ద్వారా విద్యార్థుల స్వీయ అధ్యయానికి అనుమతించింది. దీనిలో భాగంగా  తెలంగాణాలో డీడీగిరి చానల్‌ ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. గత వారం నుంచి ఈ బోధన ప్రక్రియ ప్రారంభం కాగా విద్యార్థులు ఇంటివద్దనే ఉంటూ పాఠ్యాంశాలను నేర్చుకుంటుంన్నారు. బోధనలో టీవీ పాఠాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సూ చించినప్పటికీ గురుకుల సొసైటీ లు మాత్రం తమకు తోచిన పద్ధతి ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉపాధ్యాయులు రూపొందించిన వీడియో పాఠాలను వాట్సాప్‌ ద్వారా చేరవేస్తున్నారు. అలాగే విలేజ్‌ లర్నింగ్‌ సర్కిల్స్‌ పేరుతో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, సీనియర్‌ విద్యార్థులు స్థానికంగా 10నుంచి 15మంది విద్యార్థులను సమీకరించి పాఠాలు బోధిస్తున్నారు. మైనార్టీ గురుకుల పాఠశాలల్లో మాత్రం సొసైటీ రూపొందించిన షెడ్యూల్‌ ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థులకు జూమ్‌ యాప్‌ ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రుల వద్ద స్మార్టు ఫోన్‌లు లేకపోవడం సిగ్నల్‌ సమస్యతో సగానికి పైగా విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు.  బీసీ గురుకుల పాఠశాలల్లో కేవలం పదో తరగతి విద్యార్థులకు మాత్రమే జూమ్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ విద్యాబోధన కొనసాగుతుంది. మిగిలిన క్లాసులకు కూడా ఆన్‌లైన్‌ తరగతులను విస్తరించాలని భావిస్తున్నారు.

 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రం దూరదర్శన్‌ యాదగిరి ఛానల్‌ ద్వారానే స్వీయ అధ్యయనానికి ఉపాధ్యాయులు పురమాయిస్తున్నారు.1, 2 తరగతుల వారికి ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు.. 3, 4, 5 తరగతుల వారికి ఉదయం12గంటల నుంచి ఒంటి గంట వరకు..
6, 7 తరగతులకు మధ్యాహ్నం 2నుంచి 3గంటల వరకు..  8,9 తరగుతల వారికి మధ్యాహ్నం 3 నుంచి 4గంటల వరకు..  పదో తరగతి విద్యార్థులకు మాత్రం ఉదయం 10నుంచి 11గంటల వరకు అలాగే సాయంత్రం 4నుంచి 5గంటల వరకు 2గంటల పాటు పాఠాలు ప్రసారం కానున్నాయి.తర్వాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. అయితే అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కరోనా వైరస్‌ ఉధృతి తగ్గలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటు పాఠశాలలు, అటు కళాశాలలు తెరిచేందుకు వేచి చూస్తూ వస్తోంది. నెలలు గడుస్తుండటంతో విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను గత నెల 27వ తేదీ నుంచే విధులకు హాజరు కావాలని ఆదేశించింది. అలాగే కళాశాలల్లో కూడా ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. రెగ్యులర్‌ అధ్యాపకులు విధుల్లో చేరడంతోపాటు కాంట్రాక్టు లెక్చరర్లను కూడా విధుల్లోకి తీసుకున్నారు.

దూరదర్శన్, టీ–శాట్‌ ద్వారా తరగతులు..
ఇళ్లలో నుంచే విద్యార్థులు దూరదర్శన్, టీ–శాట్‌ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు వీక్షించారు. విద్యార్థులు టీ–శాట్‌ యాప్‌ను స్మార్ట్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకుని తరగతులు విన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి సదుపాయం లేని విద్యార్థులకు గ్రామ పంచాయతీల్లో టీవీలను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌ తరగతులు వినే సదుపాయం కల్పిస్తారు. ఇక ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు వినేలా పర్యవేక్షించారు. వాట్సాప్‌లో 30 నుంచి 40 మంది విద్యార్థులను గ్రూపుగా తయారు చేసి.. వారికి వాట్సాప్‌ ద్వారా ఏ సమయంలో.. ఏ తరగతి విద్యార్థులకు.. ఏ సబ్జెక్టు బోధిస్తారో తెలియజేశారు. అలాగే ఆన్‌లైన్‌లో విన్న తరగతులకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వాటిని ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఫోన్‌ చేసి విద్యార్థులు నివృత్తి చేసుకోవాలని సూచించారు. కాగా.. రఘునాథపాలెం మండలం కోయచెలక, రేగులచెలక గ్రామాల్లో ఆన్‌లైన్‌ తరగతులను విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్‌ ఆకస్మికంగా పరిశీలించారు.

 

అనుమతులు లేని వాటికి రిజిస్ట్రేషన్లు నిలిపివేత

Tags:Online classes for gurukuls

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *