రాయచోటి ముచ్చట్లు:
ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఆగస్టు 5న సోమవారం ఉదయం 10.00గం.ల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి తో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.అర్జీదారులు తమ విజ్ఞప్తులను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాగలరని తెలిపారు.
Tags:Only applicants who have not found a solution can come to the program held at the district center – Sridhar Chamakuri