Natyam ad

వైఎస్ రాజకీయ వారసుడిగా తనకు మాత్రమే గుర్తింపు -సీఎం జగన్

అమరావతి ముచ్చట్లు:

జాతీయ మీడియాతో సీఎం జగన్ మాట్లాడుతూవైఎస్ రాజకీయ వారసుడిగా తనకు మాత్రమే గుర్తింపు ఉందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.ఒక తరంలో ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి రాజకీయాల్లోకి వస్తే.. అది అనివార్యంగా కుటుంబంలో చీలికకు దారితీస్తుందని షర్మిలను ఉద్దేశించి ఆయన చెప్పారు.ప్రస్తుతం వైఎస్ వారసుడిగా తాను ఉన్నందున షర్మిల రాజకీయాల్లోకి రాకుండా వ్యాపారాలు చూసుకుంటే బాగుండేదన్నారు.ఒకరు పార్టీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు మరొకరు ఒకే కుటుంబం నుంచి వస్తే.. అది రాజకీయ పార్టీగా ఉండదని.. కుటుంబ ట్రస్ట్ట్‌గా మారిపోతుందన్నారు.కుటుంబంలో మరొకరు పోటీగా వచ్చినప్పుడు అది కుటుంబ బంధాలను నాశనం చేస్తుందని.. మా విషయంలో ఇది రుజువైందన్నారు.ఈ విషయాన్ని షర్మిల కు చెప్పడానికి ఎప్పుడైనా ట్రై చేశారా అని ప్రశ్నించగా.. “ఆవిడ చంద్రబాబు మాట వింటుంటే తాను ఎలా చెప్పగలను” అన్నారు. ప్రతీ విషయం చంద్రబాబుతో సంబంధం ఉందని ఎలా చెప్పగలరు అంటే.. “తాను నా చెల్లెలు.. నాకు తెలుసు కదా..” అని బదులిచ్చారు .

 

 

 

Post Midle

షర్మిల ప్రచారం, కాంగ్రెస్ పార్టీ వల్ల తనకు ఎలాంటి నష్టం ఉండదని జగన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే ఒక్క ఓటు కూడా ఎక్కువ రాదని ..ఈ విషయాన్ని నోట్ చేసుకోవాలంటూ సూటిగా చెప్పారు.ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కలిసి వెళ్లడంపై జగన్ ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. ఓ రాజకీయ పార్టీగా అది వాళ్లిష్టం అని.. తమను మాత్రం పొత్తులోకి రావాలని బీజేపీ కోరలేదన్నారు.వ్యక్తిగతంగా తాను రాహుల్ గాంధీ కన్నా.. మోదీ వైపే మొగ్గు చూపుతానని.. రాహుల్ తన పట్ల వ్యవహరించిన తీరుకు తాను ఆయన కన్నా ఏ నాయకుడినైనా ఉన్నతంగానే భావిస్తా అన్నారు.

 

Tags:Only he is recognized as the political successor of YS – CM Jagan

Post Midle