స్థానికులకు మాత్రమే కేదార్ నాధ్ దర్శనానికి అనుమతి

Date:08/05/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించే అవకాశాన్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం యాత్రికులకు కల్పిస్తుంది. అయితే ఇది కేవలం రాష్ట్రంలోని స్థానికులకు మాత్రమే వర్తిస్తుంది.సిఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మే 4 నుండి ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ కేదార్ నాథ్ ఆలయం స్థానిక యాత్రికుల కోసం తెరిచి ఉంటుంది. అంతే కాదు ఉత్తరాఖండ్ నుండి యాత్రికులు రాష్ట్రంలోని ఇతర హిమాలయ దేవాలయాలను కూడా సందర్శించవచ్చు.కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి మరియు యమునోత్రిలతో కూడిన ప్రసిద్ధ చార్ ధామ్ లు ఉన్న ఉత్తరాఖండ్ లోని గర్హ్వాల్ హిమాలయాల్లో మూడు జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయి. ఇక్కడ కరోనా వైరస్ కేసులు ఏవీ నివేదించబడలేదు.ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల ప్రకారం మే 4 నుండి కొన్ని నిబంధనలతో ప్రజల అంతర్ జిల్లా ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

 

 

 

 

 

గ్రీన్ జోన్ జిల్లాల్లో ఈ సడలింపులు ఉన్నప్పటికీ యాత్రికులు దేవాలయాలను సందర్శించేటప్పుడు సామాజిక దూరాన్ని పాటించాలని సీఎం కోరారు.ఈ సందర్భంగా భారత దేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులను ఉత్తరాఖండ్ లోని దేవాలయాలను సందర్శించేందుకు అనుమతి ఇస్తారా అని విలేకరులు ముఖ్యమంత్రిని ప్రశ్నించగా… ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ సంక్షోభం దీనికి ప్రధాన అడ్డంకిగా ఉందని, పరిస్థితులు చక్కబడిన తరువాత ఈ విషయం ఆలోచన చేస్తామని ఆయన చెప్పారు.ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని యాత్రికులకు అనుమతి ఇచ్చిన గంగోత్రి మరియు యమునోత్రి దేవాలయాలు ఉత్తర కాశీ జిల్లాలో ఉండగా, కేదార్ నాథ్ మరియు బద్రీనాధ్ వరుసగా రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో ఉన్నాయి.కేదార్ నాథ్ మరియు బద్రీనాథ్ దేవాలయాలు ప్రతి సంవత్సరం త్వరితగతిన తెరిచినప్పటికీ ఈ ఏడాది కరోనా వైరస్ పరిస్థితి కారణంగా కేదార్ నాథ్ మందిరం మాత్రమే ఏప్రిల్ 29న తిరిగి ప్రారంభించబడింది. బద్రీనాథ్ మందిరం మే 15న తిరిగి తెరువబడుతుంది. గంగోత్రి మరియు యమునోత్రి ఆలయాలు ఏప్రిల్ 26నే తెరవబడ్డాయి.

ఎయిర్ ఇండియా బుకింగ్స్ షురూ

Tags: Only the locals are allowed to visit Kedar Nath

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *