Natyam ad

ఓట్లు అడిగే అర్హత వైఎస్సార్‌సీపీకి మాత్రమే

– వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

మే 13న జరగనున్న అసెంబ్లి, పార్లమెంటు ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేయమని ఓటర్లను అడిగే అర్హత వైఎస్సార్‌సీపీకి మాత్రమే ఉందని, ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం పట్టణంలోని చింతలవీధిలో గృహసారధులు, మాజీ వలంటీర్లు, పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశాన్ని ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్తంశెట్టి విశ్వనాథ్‌ , రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, కృష్ణమూర్తి కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో హామీలన్ని అమలు చేసిన వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి, ఆ పార్టీ అభ్యర్థులకు మాత్రమే ఓట్లు అడిగే అర్హత ఉందన్నారు. చంద్రబాబునాయుడు మాయమాటలతో ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసగించేందుకు వస్తున్నాడని తెలిపారు. వీటిని ఆయా వార్డు వలంటీర్లు, గృహసారధులు తిప్పికొట్టాలన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్కహామి అయినా నేరవేర్చారా అనే విషయాలను ఆలోచించాలన్నారు. జన్మభూమి కమిటిలతో ప్రజలను దోచుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దళారీలకు తావులేకుండ లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుకు డబ్బులు జమ చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వందేనని కొనియాడారు. విశ్వనాథ్‌ మాట్లాడుతూ మే 13న జరగబోవు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుకు వేసి రెండవ సారి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చేసుకోవాలని కోరారు. ఈ ప్రచారాలలో కౌన్సిలర్లు రెడ్డెమ్మ, రేష్మా, జెపి.యాదవ్‌, కాళిదాసుతో పాటు మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, పార్టీ నాయకులు ఎస్వీటి కిషోర్‌, సోము, హేము తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Only YSRCP is entitled to ask for votes

Post Midle