Natyam ad

ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణ వేదిక ప‌రిశీలించిన‌ -జేఈవో   వీరబ్రహ్మం

తిరుపతి ముచ్చట్లు:

శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 5వ తేదీన జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు వేగవంతం చేయాలని  టీటీడీ జేఈవో  వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. క‌ల్యాణ‌ వేదిక వ‌ద్ద జరుగుతున్న ఏర్పాట్లను శనివారం ఆయన అధికారులతో క‌లిసి ప‌రిశీలించారు.  ఈ సందర్బంగా జేఈవో మాట్లాడుతూ, కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రాంగణమంతా  సుంద‌రంగా తీర్చీదిద్ధాల‌న్నారు. లక్షలాదిగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కల్యాణం రోజున అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ, త‌లంబ్రాలు పంపిణీ చేయాల‌న్నారు.  ఆలయం, పరిసర ప్రాంతాలలో  తగినన్ని తాత్కాలిక, మొబైల్‌ మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేయాల‌న్నారు.పరిశుభ్రత, పారిశుద్ధ్యంకు నిర్వహణపై  ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్‌  స్థలాలను అభివృద్ధి చేయాల‌న్నారు.  అనంత‌రం జేఈవో అధికారుల‌తో క‌లిసి కల్యాణ వేదిక ముఖ్యమంత్రి విడిది చేసే భవనం ,ఆలయ పరిసరాలు, పుష్కరిణి, వాహన మండపము, అన్నప్రసాదాలు, త్రాగునీరు పంపిణీ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.  టీటీడీ సిఈ  నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సిఈవో  షణ్ముఖ కుమార్, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి అధికారి   శాస్త్రి, ఇతర అధికారులు  పాల్గొన్నారు.

Post Midle

Tags:Ontimitta Kodandaram’s welfare platform inspected – JEO Veerabraham

Post Midle