తెరుచుకున్న శబరిమల ఆలయం

Date:16/11/2020

తిరువనంతపురం

మండల పూజలు, మకరువిళక్కు పూజల కోసం శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ద్వారాలు ఆదివారం సాయంత్రం తెరుచుకున్నాయి. సోమవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ప్రతి నెల కేవలం ఐదు రోజులు మాత్రమే ఆలయాన్ని తెరిచి మాస పూజలు నిర్వహిస్తారు. కానీ, ప్రస్తుతం రెండు నెలల పాటు సుదీర్ఘంగా ఆలయం తెరిచి ఉంటుంది. ఈ సమయంలో లక్షలాది భక్తులు స్వామి దర్శనం కోసం తరలివస్తారు. అయితే, ఈ ఏడాది మాత్రం కరోనా వైరస్ కారణంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శించుకునే అవకాశం లేదు. కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.ఆదివారం సాయంత్రం 5.00 గంలకు ఆలయ తంత్రి కందారరు రాజీవరు నేతృత్వంలో తంత్రి ఏకే నంబూద్రి.. కొత్తగా ఎన్నికైన ప్రధాన తంత్రి వీకే జయరాజ్ పొత్తి.. మాలికాపురత్తమ ఆలయ ప్రధాన తంత్రి ఎం.ఎన్.రాజకుమార్ సన్నిధానం తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవిడ్ విజృంభణ కారణంగా ఆలయంలో నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు. మండల, మకరు విళక్కు పూజల సమయంలో కేవలం 85 వేల మందికి మాత్రమే దర్శనభాగ్యం కల్పించనున్నారు.

 

 

శబరిమలకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలను చేయించుకోవాలి. నీలక్కల్, పంపా బేస్ క్యాంప్‌తో పాటు రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలోనూ కోవిడ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. భక్తులు 48 గంటల ముందు అక్కడ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన రిపోర్టులను కొండకు వెళ్లిన తర్వాత అందజేస్తారు.నెగిటివ్ రిపోర్టు వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తారు. రోజుకు వేయి మందిని భక్తులను మాత్రమే అనుమతించి… శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మాత్రం 2 వేల మంది దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు ముందుగా ఆన్‌లైన్‌లోనే దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవాలి.

 

 

 

ఈ నిబంధనలు పాటిస్తేనే శబరిమలకు అనుమతి ఉంటుంది. కరోనా వైరస్ బారినపడి కోలుకున్నవారు, 10ఏళ్లలోపు చిన్నారులు.. 60 ఏళ్లుపైబడినవారిని దర్శనానికి అనుమతించరు. అలాగే, పంబా నదిలో స్నానాలు నిషేధం.. నెయ్యి అభిషేకాలకు కూడా అనుమతించరు.ఆలయం వద్ద విధులు నిర్వర్తించేవారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఒకవేళ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వారికి చికిత్స కోసం అన్ని సౌకర్యాలు కల్పించారు. తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని భావిస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు.

సీఐ గంగిరెడ్డి జన్మదిన వేడుకలు

Tags: Opened Sabarimala Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *