తిరుపతిలో రెండు ప్రత్యేక కోర్టులను ప్రారంభించిన: సీజేఐ

తిరుపతి ముచ్చట్లు:

ఎర్ర చందనం అక్రమ రవాణా కేసుల విచారణ నిమిత్తం ఏర్పాటైన రెండు ప్రత్యేక కోర్టులను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఇవాళ ప్రారంభించారు.తిరుపతిలోని ఆల్‌ ఇండియా రేడియో కార్యాలయం సమీపంలోని తుడా కాంప్లెక్స్‌లో ఈ కోర్టులు ఏర్పాటయ్యాయి. ప్రారంభోత్సవం అనంతరం జస్టిస్‌ ఎన్వీ రమణ ఎస్వీ యూనివర్సిటీలోని సెనేట్‌ హాల్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ జిల్లా న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొంటారు. అనంతరం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన అవార్డులు ప్రదానం చేయనున్నారు.

 

Post Midle

Tags: Opened two special courts in Tirupati: CJI

Post Midle
Natyam ad