Opening liquor stores

తెరుచుకున్న మద్యం దుకాణాలు

– జిల్లా సరిహద్దుల్లోని కర్ణాటక బార్లతో ఏపీ ఖజానాకు భారీ నష్టం
– ఆంధ్రా మద్యం కన్నా కర్ణాటక మద్యంకు జోరెక్కువా
– మందుబాబులు కర్ణాటక వైన్స్ లకే అధిక ప్రాధాన్యత

Date:04/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

గత నలభై అయిదు రోజులుగా కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్ దృష్ట్యా మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేశారు.  మూడోసారి లాక్డౌన్ ప్రకటించిన ప్రభుత్వం కొన్నిటికి వెసులుబాటు కల్పించింది. అందులో మద్యం దుకాణాలులను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా ఈ రోజు మద్యం దుకాణాలు తెరువబడ్డాయి. ఏపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు 25%  అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు. గత 45 రోజులుగా మద్యం దొరక్క తీవ్ర కష్టాలు పడ్డ మందుబాబులు గ్రామాల్లో దొంగచాటున అమ్ముతున్న అరకొర నాటు సారా తాగుతూ జీవించారు. ప్రస్తుతం మద్యం దుకాణాలు తెరవడంతో అధిక సంఖ్యలో పోటెత్తారు. తాగేందుకే కాక దాచుకునేందుకు కొనుక్కుంటున్నారు. ప్రభుత్వం మొత్తం మీద కొన్ని బ్రాండ్లు మాత్రమే అమ్ముతుండడంతో మందుబాబులకు కావాల్సిన బ్రాండ్లు దొరక్క  నిరాశ చెందుతున్నారు. దీంతో సరిహద్దులోని కర్నాటక బార్లకు క్యూ కడుతున్నారు.  పుంగనూరు సరహద్దులోని  కర్ణాటక మధ్యం షాపులకు  మందు బాబులు క్యూ కట్టారు. ఈ కష్టకాలంలో ఏపీకి రావాల్సిన ఆదాయం కాస్త కర్ణాటక ప్రభుత్వానికి పంచినట్టయింది. జిల్లాలోని అన్ని రహదారులను కలుపుతూ కర్నాటకలో మద్యం షాపులు వందల్లో వెలవడం  చెప్పుకోదగ్గ విషయం.  దీంతో ఏపీ ఖజానాకు భారీ నష్టం వాటిల్లనుంది. ధరలు, నాణ్యతలో కర్ణాటక  – ఏపీ కన్నా మెరుగ్గా ఉండటంతో కర్ణాటక భార్లవైపు మధ్యం ప్రియులు మొగ్గు చూపుతున్నారు. దీంతో అధిక ధరలకు అమ్ముతున్న ఆంధ్రా వైన్స్ లు బోసిపోయాయి. ఏపీలోని మందు బాబులు యథేచ్ఛగా కర్నాటక వైన్స్ కు తరలి వెళ్లి తమ వెంట మద్యం తెచ్చుకుంటున్న  సంబంధిత శాఖలు చోద్యం చూస్తున్నారు.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మద్యం ప్రియులకు అన్ని బ్రాండ్లు సరఫరా చేసి ఏపి ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని  కర్ణాటక వైన్స్ లకు మందుబాబులు వెళ్లకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

కరోనా పుకార్లతో కదలిన అధికారులు

Tags: Opening liquor stores

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *