పుంగనూరులో జగనన్న ప్రాణవాయువు కేంద్రం ప్రారంభం
– హాజరైన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్, కలెక్టర్ హరినారాయణ్
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు సిహెచ్‌సి ఆసుపత్రిలో జగనన్న ప్రాణవాయువు కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి సొంత నిదులు కోటిరూపాయలతో ఆక్సిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రెండు విడతల కరోనా నియంత్రణలో నియోజకవర్గ ప్రజలకు ఆక్సిజన్ లేక ఎంతో మందిని కోల్పోయామని మంత్రి పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆక్సిజన్ ప్లాంటుతో పాటు ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు కూడ ఏర్పాటు చేసి ముందుజాగ్రత్తగా కరోనా నియంత్రణకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దని, ప్రజల ప్రాణాలకు ముప్పువాటిళ్లకుండ తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ హరినారాయణ్ , సబ్ కలెక్టర్ జాహ్నవి, చిత్తూరు ఎంపి రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ఆదిమూలం, జంగాలపల్లె శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, ఆసుపత్రి కమిటి చైర్మన్ డాక్టర్ శరణ్, డిసిసిబి చైర్మన్ రెడ్డెమ్మ, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జెడ్పిటిసి జ్ఞానప్రసన్న, ఏపిఐఐసి చైర్మన్ షమీమ్‌అస్లాం, ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, బోయకొండ చైర్మన్ మిద్దింటి శంకర్‌నారాయణ, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Opening of Jagannath Oxygen Center at Punganur