రైతు బజారులో ఉల్లిగడ్డల కేంద్రం ప్రారంభం

ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

Date:27/10/2020

ఆదోని ముచ్చట్లు:

ఆదోని పట్టణంలో పాత బస్టాండ్ ప్రాంతంలోని రైతు బజార్ లో ఉల్లిగడ్డ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా   ఆయన మాట్లాడుతూ బయట మార్కెట్లో కిలో ఉల్లి గడ్డలు 80 రూపాయలు నుంచి 100 రూపాయలు ధర పలుకుతుందని అలాంటిది 40 రూపాయలకే కిలో ఉల్లి గడ్డలు రైతుబజార్లలో విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి, రైతు భరోసా ,చేయూత, పొదుపు లక్ష్మి గ్రూపులకు వై ఎస్ ఆర్ ఆసరా,చిన్న వ్యాపారాలకు చేయూత ఇలాంటి పథకాలు ఎన్నింటినో అమలు చేస్తున్నారని మరెన్నో అమలు చేసేందుకు జగనన్న సిద్ధంగా ఉన్నారని సాయి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలని ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యనే ఉండి రైతు ప్రవేశపెట్టిన పథకాలను ప్రచారం చేయాలని ఆయన సూచించినట్లు తెలిపారు. రైతు బజార్ లో ఎదుర్కొంటున్న సమస్యలు కూరగాయల వ్యాపారులు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు పోగా వాటన్నింటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహబూబ్ బాషా రైతు బజార్ ఎస్టేట్ అధికారి హరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ కార్యాలయాన్ని  ప్రారంభించిన బి వి జయ నాగేశ్వర్ రెడ్డి

Tags; Opening of onion center at farmer’s market

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *