శ్రీ వెంకటేశ్వర పశుపరిశోధనా కేంద్రం ప్రారంభo
పలమనేరు ముచ్చట్లు:
పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలంలోని శ్రీ వెంకటేశ్వర పశుపరిశోధనా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇటి అండ్ ఐవియఫ్ ల్యాబ్ ను పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఈరోజు ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతరించిపోతున్న పుంగనూరు జాతి దేశీయ గోవుల అభివృద్ధి కోసం నూతనంగా ఇటి అండ్ ఐవియఫ్ ల్యాబ్ ను ఏర్పాటు చేసి దేశీయ పుంగనూరు జాతి ఆవుల అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయం అన్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో మానవులలో ఇప్పటికే అభివృద్ధి చెందిన టెక్నాలజీ తో దేశీయ ఆవుల అభివృద్ధి చేయడం కోసం మిషన్ పుంగనూరు పేరుతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.మిషన్ పుంగనూరు ద్వారా మళ్ళీ శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి గోసంపద అభివృద్ధి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వెంకటే గౌడ, ఎమ్మెల్సీ భరత్, జడ్పి ఛైర్మెన్ శ్రీనివాసులు, విసి డాక్టర్ పద్మనాభరెడ్డి, సంచాలకులు సర్జన్ రావ్, తదితరులు పాల్గొన్నారు.

Tags: Opening of Sri Venkateswara Animal Research Centre
