వీరబల్లిలో సచివాలయం ప్రారంభం

వీరబల్లి  ముచ్చట్లు:


అన్నమయ్య జిల్లా  రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి మండలం పెద్దివీడులో ఇందన, అటవీ, భూగర్భ గనుల శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  సచివాలయాన్ని ప్రారంభించారు ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్వవస్థను ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబా టులోకి తెచ్చారన్నారు అనంతరం  రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రజల మేలు కోరి  వాలంటీర్ల వ్వవస్థను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు తగ్గాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా సచివాలయ వ్వవస్థను ప్రవేశపెట్ట బోతున్నార  న్నారు  ఈ కార్యక్రమంలో కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి  వీరబల్లి ఎంపీపీ గాలివీటి  రాజేంద్రనాథ్  రెడ్డి గాలివీటి వీర నాగిరెడ్డి వీరబల్లి జెడ్పిటిసి శివరాం ప్రభుత్వ అధికారులు, గ్రామ సచివాలయం సిబ్బంది,గ్రామ వలంటీర్లు, వీరబల్లి మండల సర్పంచ్లు,ఎంపీటీసీలు,మండల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గున్నారు.

 

Tags: Opening of the Secretariat at Veeraballi

Leave A Reply

Your email address will not be published.