ప్రారంభమైన పోలింగ్

Opening polling

Opening polling

Date:05/12/2019

బెంగళూరు ముచ్చట్లు:

కర్ణాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ఆరంభమైంది.

17 మంది శాసనసభ్యులు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడంతో జేడీ(ఎస్), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.

17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా అందులో మస్కీ, రాజరాజేశ్వరి నియోజకవర్గాల ఎన్నికలు కర్ణాటక హైకోర్టులో వేసిన పిటిషన్లతో పెండింగులో ఉంచారు.

15 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఉప ఎన్నికల సందర్భంగా బెంగళూరు పోలీసు కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు.

అతానీ, కాగ్వాద్, గోకక్, ఎల్లాపూర, హిరికెరూర్, రాణిబెన్నూర్, విజయనగర, చిక్ బళ్లాపుర, హోస్కేటే, కేఆర్ పేట, హున్సూర్, మహాలక్ష్మీ లేఅవుట్, కేఆర్ పురం, శివాజీనగర్, యశ్వంత్ పూర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ పోలీసుల భారీ బందోబస్తు మధ్య సాగుతోంది.

323 ఫ్లైయింగ్ స్క్వాడ్, 578 పోలీసు బృందాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి.

పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు.

 

చిత్తూరుజిల్లాలో దారుణం…

 

Tags:Opening polling

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *