చిత్తూరులో ఆపరేషన్ గజ సక్సెస్
-ఒంటరి ఏనుగును బంధించిన అధికారులు
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా లో ముగ్గురిని బలగొన్న ఒంటరిఏనుగును పారెస్టు అధికారులు ఎట్టకేలకు బంధించారు. గుడిపాల మండలం కమ్మతిమ్మాపల్లె సరిహద్దులో చెరకు తోటలో ఉన్న ఏనుగును మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్నారు. శిక్షణ పొందిన రెండు కొంకి ఏనుగుల సాయంతో ఏనుగును అదుపులోకి తీసుకున్నారు. . ముగ్గురు మృతికి కారణమైన ఏనుగును పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, రెండురోజులుగా చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి. చిత్తూరు జిల్లా రామాపురం వద్ద ఏనుగు సంచరిస్తుందని సమాచారం అందుకున్న అటవీ అధికారులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. చెరుకుతోటలో ఉన్న ఏనుగును గమనించి దానికి మత్తు ఇంజిక్షన్ ఇచ్చి బంధించారు. ఇదే ఏనుగు చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలం రామాపురంలో వెంకటేశ్, సెల్వి దంపతులపై దాడి చేపి చంపివేసింది.

దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చోట కూడా ఏనుగు మరో వ్యక్తిపై దాడి చంపింది. సి.కె పల్లి గ్రామంలో కార్తీక్ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచింది. గాయపడ్డ అతడినిస్థానికులు ఆసుపత్రికి తరలించారు. వన్యమృగాల పట్ల ప్రజలు ఎప్పుడు అప్రమత్తంగా డీఎఫ్వో ఛైతన్యకుమార్ అన్నారు. అనంతరం ఏనుగు దాడిలో మరణించిన కుటుంబానికి ప్రభుత్వం తరఫున పది లక్షల రుపాయల నష్టపరిహారాన్ని అందించారు. ఆపరేషన్ గజ విజయవంతం కావడంతో ప్రజలు, పోలీసులు ఊపరిపీల్చుకున్నారు.
Tags: Operation Gaja in Chittoor was a success
