బెంగాల్ లో ఆపరేషన్ లోటస్

Date:11/02/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:
ప్రధాని మోడీ పగబట్టారంటే ఎలా ఉంటుందో తమిళనాడు లో శశికళ జీవితం చూస్తేచాలంటారు విశ్లేషకులు. తనకు అడ్డుగా వుండే వారిని తొలగించుకోవడానికి మోడీ సామ,దాన, దండోపాయాలనుప్రయోగించడంలో ఏమాత్రం వెనుక అడుగు వేయరన్నది తెలిసిందే. ఇప్పుడు మోడీ టార్గెట్ రాహుల్ తరువాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జాతీయ రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లోతలపోటు అవుతారని లెక్కేసి వీరికి చుక్కలు చూపించే పనిని వ్యూహాత్మకంగా మొదలు పెట్టేశారు ప్రధాని. బెంగాల్ లో 42 పార్లమెంట్ స్థానాలు ఉండటంతో ఉత్తరాదిన మైనస్ అయితే మిగిలిన చోట్ల ప్లస్ చేసుకోవాలనే దూర ఆలోచన కమలాన్ని బెంగాల్ పై కన్నేసేలా చేసిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ముందుగా బెంగాల్ పని పట్టాలని భావించి నెలరోజుల్లో ఇప్పటికి మూడు సార్లు ఆ రాష్ట్రంలో పర్యటించారు మాటల మాంత్రికుడు. ఒక పక్క శారదా కుంభకోణం వ్యవహారం పై సీరియస్ గా సిబిఐ దృష్టి పెట్టడం తదనంతర పరిణామాల నేపథ్యంలో బెంగాల్ లో ప్రధాని పర్యటన సక్సెస్ కావడం కాషాయ దళంలో ఉత్సహాన్ని నింపింది. ఈ సందర్భంగా మోడీ, దీదీ పై పేల్చిన మాటల తూటాలు కూడా బాగా క్లిక్ అయ్యాయి కూడా. చాయ్ వాలా అయిన తాను తేయాకును అందించే వారిని కలవడం అనందం గా ఉందంటూ వారి మనసులు దోచే ప్రయత్నం చేశారు ప్రధాని. తేయాకు కార్మికులతో పాటు 40 కోట్లమంది అసంఘటిత రంగంలో వున్నవారికి పెన్షన్ స్కిం తీసుకువస్తామని వారి జీవితానికి భరోసా కల్పిస్తామని హామీల వర్షం కురిపించి ఆకట్టుకున్నారు ప్రధాని.
దళారుల కోసం దీదీ దాదాగిరి చేస్తూ భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ప్రధాని మోడీ వ్యాఖ్యలకు మమత సైతం ఘాటైన జవాబు ఇచ్చారు. ఎన్నికలు వచ్చేటప్పటికి ఆయన చాయ్ వాలా గా మారతారని ఎద్దేవా చేశారు. తరువాత రఫెల్ వాలా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోడీ అబద్ధాల పుట్ట అంటూ విరుచుకుపడ్డారు మమత. అటు ప్రధాని ఇటు మమత రాజకీయాలతో ఇప్పుడు బెంగాల్ లో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇది ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.
Tags: Operation Lotus in Bengal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *