పుంగనూరు లయ న్స్ క్ల బ్‌ ఆధ్వర్యంలో పేదలందరికి కంటివైద్య పరీక్షలు -డాక్టర్‌ శివ

Date:17/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని లయన్స్ క్ల బ్‌ ఆధ్వర్యంలో కంటి వైద్య చికిత్సలు నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్‌ జిల్లా పీఆర్‌వో డాక్టర్‌ పి.శివ తెలిపారు. ఆదివారం స్థానిక బిఎంఎస్‌ క్లబ్‌లో క్లబ్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ కె.సరళతో కలసి కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 77 మంది రోగులకు చికిత్సలు చేశారు. వారిలో 32 మందికి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కళాశాలకు చెందిన వైద్యబృందం డాక్టర్లు శ్రావణి, నవీన్‌, బాలకృష్ణ, తృణచే ఉచితంగా ఆపరేషన్లు , కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్‌ శివ తెలిపారు. ఆపరేషన్లు చేసుకునే వారికి అన్ని వసతులు కల్పించి, ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కోవిడ్‌ కారణంగా ఆపివేసిన ఉచిత కంటి వైద్యశిబిరాలను ఇక మీదట ప్రతి రెండవ ఆదివారం వైద్యశిబిరం నిర్వహిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ వైద్యశిబిరంలో లయ న్స్ క్ల బ్‌ ప్రతినిధులు కెసిటివి అధినేత ముత్యాలు, జెఏసీ చైర్మన్‌ వరదారెడ్డి, రఘునాథరెడ్డి, పీఎల్‌.శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

కొవిడ్ వ్యాక్సిన్  నిరంత‌రం కొన‌సాగే ప్ర‌క్రియ: మంత్రి ఈట‌ల

Tags: Ophthalmological examinations for the poor under the auspices of the Lions Club in Punganur – Dr. Shiva

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *