డిఎంహెచ్వో ముందు విపక్షాల అందోళన

అనంతపురం ముచ్చట్లు:

 

అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా ఉన్న దంపతులు వారి ఇంట్లో మైనర్‌ బాలిక ను పని మనిషిగా పెట్టుకోవడమే కాకుండా.. ఆ బాలికను విచక్షణా రహితంగా గాయాలు అయ్యేలా హింసించడం దారుణమని విపక్ష పార్టీల నాయకులు మండిపడ్డారు. అనంతపురంలో టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌, సీపీఎం పార్టీల నాయకులు డీఎంహెచఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అదే సమయంలో కార్యాలయానికి వచ్చిన డీఎంహెచఓను ఆందోళనకారులు అడ్డుకున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆమెతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను చూసేందుకు వెళుతున్న నాయకులు, తెలుగు మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరి గింది. అనంతరం బాలికకు చికిత్స అందించిన డాక్టర్‌ను బయటకు పిలిపించి బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకారులకు ఆరా తీశారు.  బాధితురాలికి న్యాయం అందించాల్సిన న్యాయవాది వృత్తిలో ఉంటూ మైనర్‌ బాలికను చీకటి గదిలో అసభ్యంగా ప్రవర్తించడం హేయమ న్నారు. బాధితురాలికి మెరుగైన వైద్య పరీక్షలు అందించడంతోపాటు సంఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 

Tags: Opposition in front of DMHO

Post Midle
Post Midle