సీఎం పర్యటన నేపథ్యంలో విపక్ష నేతల అరెస్ట్

Opposition leaders arrested in the wake of the visit of the Chief Minister

Opposition leaders arrested in the wake of the visit of the Chief Minister

Date:27/02/2018
మంచిర్యాల ముచ్చట్లు:
సీఎం కేసీఆర్  పర్యటన నేపథ్యంలో అడ్డుకుంటారాన్నే ముందస్తు సమాచారంతో  మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా విపక్ష నేతలను, కార్మిక నాయకులతో పాటు ప్రజా సంఘాల నేతలను అరెస్ట్ చేసారు. రాత్రి నుంచే  అరెస్ట్ ల పర్వం కొనసాగింది.  చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోని కాంగ్రెస్,బీజేపీ, వామపక్షాలు, టీజేఏసీ నేతలంతా పోలీసుల అదుపులో ఉన్నారు.  అరెస్టులపై నేతలు మండిపడుతున్నారు.కోల్ బెల్ట్ ప్రాంతం అయిన శ్రీ రాంపూర్ లో సిఎం కేసిఆర్ భహిరంగ సభ సందర్భంగా బెల్లంపల్లి, మందమర్రి,  మంచిర్యాల, శ్రీరాంపూర్ ప్రాంతాల్లో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘ అధ్యక్షులు పార్వతి రాజిరెడ్డితో  పాటు కార్మిక బిడ్డల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, వివిద రాజకీయ పార్టీల నాయకులను అరెస్టు చేశారు.దీంతో మందమర్రి పోలీసు స్టేషన్ ముందు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నేతలు ధర్నా నిర్వహించారు. ఒక వైపు ప్రభుత్వమే బొగ్గు బాయిలకు సెలవు ఇచ్చి సభను విజయవంతం చేయాలని టిఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తూ మరోవైపు అరెస్టులు చేయడమేంటని సంఘం కార్యదర్శి కామెర గట్టయ్య ప్రశ్నించారు.
Tags: Opposition leaders arrested in the wake of the visit of the Chief Minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *