ప్రతిపక్షాల రాద్దాంతం

Date:16/09/2020

విజయవాడ ముచ్చట్లు:

రధానికి భద్రత కల్పించే చర్యల్లో భాగంగా అధికారులు కార్పెట్ ని తెరిచి చూసే సమయంలో సింహాలు కనిపించలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రథాన్ని ఉపయోగించలేదని దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.  గత ప్రభుత్వం హయాంలో జరిగిందో ఇప్పుడు జరిగిందో విచారణలో తేలుతుంది. ఘటనపై దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తాం. సెక్యూరిటీ ఏజెన్సీ కి దేవాలయం భద్రతా అప్పగించామని అన్నారు. సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతాలోపం అని తేలితే దానిపై చర్యలు తీసుకుంటాం. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయి. అంతర్వేది ఘటన తరువాత అన్ని దేవాలయాల్లో భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల పోస్ట్‌ల భర్తీపై వీడియో కాన్ఫెరెన్స్

Tags: Opposition letter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *