యదేఛ్చగా నకిలీ విత్తనాలు
కరీంనగర్ ముచ్చట్లు:
రాష్ట్రంలో విత్తనాల సరఫరాలో కోట్ల రూపాయల గోల్మాల్ అవుతోందని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు విత్తన కంపెనీలతో పోటీపడి ప్రభుత్వ వర్సిటీ విత్తనాల ధరలు పెంచారని, రైతులు ప్రైవేటు విత్తన కంపెనీల నుంచి విత్తనాలు తీసుకుంటున్నారని, దీంతో నకిలీ విత్తనాలు రైతుల వద్దకు వస్తున్నాయని మండిపడ్డారు. నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకుంటామని ప్రతి సంవత్సరం ప్రభుత్వం చెబుతోందని, ఎన్ని విత్తనాల కంపెనీల మీద కేసులు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు అరికట్టామని ప్రభుత్వం చెబుతోంది కదా మరి రైతుల వద్దకు నకిలీ విత్తనాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇదివరకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో సోయా విత్తనాలు మొలకెత్తలేక రైతులు నష్టపోతే ఏ ఒక్కరికి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు.విక్రాంత్ కంపెనీ సప్లాయ్ చేసిన సోయా విత్తనాలు మొలకెత్తక పోతే ఆ కంపెనీ మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మహారాష్ట్రకు చెందిన విక్రాంత్ కంపెనీ తెలంగాణలో ప్రభుత్వం ప్రమేయం లేకుండానే రైతులకు అమ్మినరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక రకాల నకిలీ విత్తనాలు రైతులకు వ్యాపారస్తులు అమ్ముతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని అన్నారు. ప్రభుత్వానికి సంబంధాలు లేకుండానే నకిలీ విత్తనాలు మార్కెట్లో దొరుకుతున్నాయా అని ప్రశ్నించారు. పోయిన సంవత్సరం కూడా మిర్చిలో నకిలీ విత్తనాలు వచ్చి రైతులను నిండా ముంచి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. నకిలి విత్తనాలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వానికి సవాల్ చేశారు.
Tags: Optionally duplicate seeds

