గన్ తో పెంపుడు కుక్క ను కాల్చి చంపిన పాస్టర్
నందిగామ ముచ్చట్లు:
ఒక పాస్టర్ ఎయిర్ గన్ తో పెంపుడు కుక్క ను కాల్చి చంపిన ఘటన నందిగాలో చోటు చేసుకుంది. గతంలో ఏపీఎస్పీ పోలీసు బెటాలియన్ లో విధులు నిర్వహించి రాజీనామా చేసిన హెమర్టన్, ఇప్పుడు మిషనరి చర్చి పాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం అతని వద్ద ఉన్న ఎయిర్ గన్ తో కుక్క ను కాల్చి అనంతరం పూడ్చి పెట్టిన వైనం శనివారం బయటపడింది. నందిగామ (మం) అడవిరావులపాడు గ్రామం లోని ఘటన జరిగింది. పాస్టర్ హెమర్టన్ ను అదుపులో తీసుకుని విచారిస్తున్న నందిగామ పోలీసులు, ఎయిర్ గన్ ఎలాంటి సందర్బంలో వినియోగించాలనే కోణం లో దర్యాప్తు చేస్తున్నారు.
Tags: or who shot dead pet dog with gun

