రోడ్ల మరమ్మతులకు ఆదేశం

– మేయర్ గుండా ప్రకాష్ రావు

Date:04/09/2020

వరంగల్ ముచ్చట్లు:

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని గుంతల మాయమైన రోడ్లను పరిశీలించి మరమ్మతుల కొరకు గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్ రావు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్న రోడ్లన్నీ గుంతల మయం అయ్ఆయయి. దాంతో  వాహన దారులు  రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వ్యాపారరీత్యా మార్కెట్ కు వస్తున్న వాహనాలు ఎక్కడికక్కడ ఆగి పోతున్నాయి. ప్రధాన రహదారి వద్ద ఉన్న పెద్ద పెద్ద గుంతలను అయన  పరిశీలించారు.  రోడ్ల మరమ్మతులు గురించి సుమారు నామినేషన్ ప్రాతిపదిక కింద 20 లక్షల నుండి 25 లక్షల వరకు బడ్జెట్ కేటాయిస్తామని అయన అన్నారు. అధికారులకు వర్క్ చేయాలని ఆదేశించామని మేయర్ తెలిపారు.

వైఎస్ ఆత్మకూడా క్షోభిస్తుంది

Tags: Order for repair of roads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *