Natyam ad

సీడ్స్ కంపెనీ మూసివేతకు ఆదేశాలు-మంత్రి గుడివాడ

విశాఖపట్నం ముచ్చట్లు:


సీడ్స్ కంపెనీ ని మూసి వేయాలని ఆదేశించాం.  ఆ సంస్థ కు నోటీసులు ఇచ్చాం. తప్పు జరిగితే ఒప్పు కోవాలిసిందేనని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. . మొదట సారి జరిగిన ప్రమాదం లో ఏసీ డెక్ లలో క్రిమిసంహరక మందులు కలవడం వల్ల జరిగిందని తేలింది. ఆ ప్రమాదంలో  గ్లోరిఫై పాలీస్ అనే రసాయనం వెలువడినట్టు తెలిసింది. ఈ సారి ఏ సి డెక్ వల్ల జరిగిందా, క్రిమిసంహర మందులు వల్ల జరిగిందా అని నిర్ధారణ కావలసివుందని అన్నారు. ఇది యాదృచ్ఛిక చర్య లేక ఉద్దేశ్య పూర్వక చర్య అనేది తేల్చాల్సివుంది. పరిశ్రమలకు సేఫ్టీ ఆడిట్ ముఖ్యం.లేని పక్షం లో ఆయా కంపెనీలు పై చర్య తీసుకుంటాం. జరిగిన ఘటన పై ఉన్నతస్థాయి విచారణ చేస్తాం. లీక్ ఐనా ప్రదేశంలో నమూనాలను హైదరాబాద్ లోని ఐ సి ఎం ఆర్ కు పంపుతున్నామని అన్నారు.

 

Tags: Orders for closure of seeds company- Minister Gudivada

Post Midle
Post Midle