పిల్లల పొదుపును పోస్టాఫీసుల్లో నిర్వహించండి – జిల్లా పోస్టల్ ఎస్పీ చెన్నకేశవులు
పుంగనూరు ముచ్చట్లు:
తల్లిదండ్రులు తమ పిల్లల ఖాతాలను పోస్టాఫీసుల్లో తెరచి, పొదుపు చేయడం పిల్లలకు నేర్పించాలని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ చెన్నకేశవులు సూచించారు. బుధవారం పట్టణంలో ఉద్యోగులు, ఖాతాదారుల సమావేశాన్ని ఇన్స్పెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నకేశవులు మాట్లాడుతూ 10 సంవత్సరాల లోపు ఆడపిల్లల పేరున ఖాతాలు రూ.250లతో తల్లిదండ్రులు ప్రారంభించుకోవచ్చునన్నారు. అలాగే బాలికలకు వివాహానంతరం ఖాతాను కొనసాగిస్తూ పొదుపు చేసిన సొమ్ము 50 శాతం డ్రా చేసుకునేందుకు వీలుందన్నారు. సుకన్య సంమృద్ధిఖాతాలో పొదుపు చేసే సొమ్ముకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉందన్నారు. అలాగే 15 సంవత్సరాల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను రూ.500ల నుంచి ప్రారంభించి సొమ్మును జమ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు. పోస్టాఫీసుల్లో సెవింగ్ అకౌంట్లు, ఉమ్మడి ఖాతాలు తెరుచుకునే సౌకర్యం కల్పించామన్నారు. అలాగే ఖాతాదారులకు ఏటిఎం కార్డులు అందిస్తూ అత్యధిక వడ్డీ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు పోస్టాఫీసుల ద్వారా లావాదేవిలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పోస్టల్ అసిస్టెంట్ సుపరింటెండెంట్ నీలిమా, పలమనేరు ఇన్స్పెక్టర్ మదన్మోహన్తో పాటు బిపిఎంలు , తల్లిదండ్రులు , ప్రజలు హాజరైయ్యారు.

Tags; Organize Children’s Savings in Post Offices – District Postal SP Chennakesavulu
