ఏబీవీపీ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీల నిర్వహణ
-ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐ సోమయ్య
నెల్లూరు ముచ్చట్లు:
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి నాయుడుపేట శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద యువజనోత్సవాలులో భాగంగా మొదటి రోజు విద్యార్థులకు కబడ్డీ పోటీలు గురువారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నాయుడుపేట సీఐ వై.వి. సోమయ్య పాల్గొన్నారు .ఈ సందర్భంగా సి ఐ .వై వి సోమయ్య కబడ్డీ పోటీలను లాంచనంగా ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు వివిధ క్రీడా రంగాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ప్రతి విద్యార్థి క్రీడల అందు ఆసక్తి చూపాలని సూచించారు.ఈ కార్యక్రమాల్లో ఎబివిపి జిల్లా కన్వినర్ కార్తీక్, నెల్లూరు విభాగ్ ఫార్మసీ కన్వీనర్ భాను ప్రకాష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తరుణ్ పెట్టుకో పెట్టుకో సహా భాగ్ కన్వీనర్ లక్ష్మీనారాయణ నగర కార్యదర్శి పవన్ కుమార్ , చందు తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Organizing kabaddi competitions under the auspices of ABVP