Date:30/11/2020
విశాఖపట్నం ముచ్చట్లు:
జిల్లాలోని విశాఖ ఓడ రేవుకు భారీ నౌక వచ్చింది. సోమవారం పోర్ట్ ఇన్నర్ హార్బర్లోకి ఓస్లో అనే అతి భారీ రవాణా నౌక చేరింది. ఈ నౌక 229.20 మీటర్ల పొడవు, 38 మీటర్ల భీమ్కలిగి ఉంది. గత ఏడాది భారీ నౌకలను ఇన్నర్ హార్బర్లోకి తీసుకు వచ్చేందుకు విశాఖ పోర్ట్ అధికారులు సింగపూర్‌లో సిములేషన్ స్టడీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భారీ నౌక నేటిఉదయం పోర్టు చేరగా.. అధికారలు ఏడో బెర్త్‌ను ఇచ్చారు. ఓస్లో భారీ రవాణా నౌక సౌత్ ఆఫ్రికాలోని రిచర్డ్ బే పోర్ట్ నుంచి బయలుదేరి స్టీమ్ కోల్‌తో విశాఖ పోర్టుకు చేరుకుంది. ఈరవాణ(కార్గో) నౌక చూపరులను తెగ ఆకర్షిస్తోంది. పోర్టు చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఇటువంటి భారీ లోడ్‌ను కలిగిన కార్గో నౌక రావటం గొప్ప విషయమని ఓడరేవు అధికారులుబావిస్తున్నారు.
ధర్మపురి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు
Tags:Oslo, the largest cargo ship to reach the port of Visakhapatnam