నాలుగున్నర ఏళ్లలో తలక్రిందులైన ఉస్మానియా వర్శిటీ

Osmania University overturned in four and a half years

Osmania University overturned in four and a half years

Date:09/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
 ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) విద్యార్థుల వైపు అందరూ చూస్తున్నారు. సరిగ్గా నాలుగున్న ఏళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్శిటీలో పరిస్థితులు తలక్రిందులుగా మారిపోయాయి. కేసీఆర్‌కు జై కొట్టిన విద్యార్థులు కేసీఆర్‌ను దింపేందుకు కంకణం కట్టుకున్నారు. దొరపాలనకు చరమగీతం పాడాలని ఉస్మానియా యూనివర్శిటీ తీర్మానించింది. విద్యార్థులు, కళాకారులతో కలిసి గజ్జకట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. కేసీఆర్ మోసాలు, అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పోలీసుల లాఠీలకు ఎదురొడ్డి పోరాటం చేసిన ఘనత ఓయూ విద్యార్థులదేతెలంగాణ అక్షాంక్షతో అప్పటి ఉద్యమ నాయకుడు కే చంద్రశేఖర్  ఓయూ విద్యార్థులు ఆదరించారు. వారి పోరాటంతో అప్పటి యుపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకతప్పలేదు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కూడా కేసీఆర్‌కు పూర్తిస్థాయి మద్ధతు ఇచ్చారు.  నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతోనే తెలంగాణ ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే.
ఈ నినాదాన్ని తుంగలో తొక్కిన సీఎం కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకు ఓయూ విద్యార్థులు, నిరుద్యోగులు సన్నద్ధమౌతున్నారు.ఇప్పటికే విద్యార్థుల బృందం తొలిదశ యాత్రలను పూర్తి చేసింది. మలిదశ యాత్రలకు సన్నద్ధమౌతున్నట్లు సమాచారం. ఓటు ద్వారా కేసీఆర్ కుటుంబ దొరతనాన్ని అంతం చేయాలని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. దీంతో  కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా విద్యార్థులు యూటర్న్ తీసుకున్నట్లు తెలిసింది. విద్యార్థుల్లోని అసంతృప్తిని కాంగ్రెస్ పార్టీ తన అనుకూలంగా మార్చుకోవాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మార్గదర్శకంలో తెలంగాణ పీసీసీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.
విద్యార్థులు కూడా కేసీఆర్ కంటే కాంగ్రెస్ మేలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలిసింది. ఓయూతో పాటు మిగతా యూనివర్శిటీల్లోని విద్యార్థులు, నిరుద్యోగులను ఏకం చేసే పనిలో కాంగ్రెస్ నాయకులున్నారు. దీనికి పూర్తిస్థాయిలో విద్యార్థులు సహకరించడంతో ఓయూ కాంగ్రెస్‌కు అడ్డగా మారిందని తెలుస్తుంది. టీఆర్‌ఎస్ పార్టీని ఓడించడమే టార్గెట్‌గా విద్యార్థులు తీర్మానించారు. ఓయూలోని విద్యార్థి నాయకుల్లో ఒకరికీ కాంగ్రెస్ పార్టీ టిక్కెటు ఇస్తుందని ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థుల్లో కూడా జోష్ పెరిగింది.
ఓయూతో పాటు మిగతా యూనివర్శిటీల్లోని విద్యార్థులను ఏకం చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. దీంతో యూనివర్శిటీల్లో పూర్తిస్థాయిలో పాగ వేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. కేసీఆర్ విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలనే ప్రధానాస్త్రాలుగా తీసుకునే విధంగా ఓయూ విద్యార్థులను కాంగ్రెస్ సన్నద్ధం చేస్తుంది. ప్రతి ఏటా 1.10లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ వాటిని అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రాష్ట్రానికి ఐటీఐఆర్ ప్రాజెక్టును మంజూరు చేసింది.
ఈ ప్రాజెక్టు ద్వారా 20ఏళ్లల్లో 70లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇంత పెద్ద ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కూడా చేయలేదు. దీన్నిబట్టి నిరుద్యోగులపై కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో తెలుస్తుంది తెలంగాణ ఉద్యమంలో ఇచ్చిన హామీలను ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌కే సాధ్యమని అప్పట్లో విద్యార్థులు భావించారు. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఓయూతో పాటు తెలంగాణలోని యూనివర్శిటీలన్ని కూడా మద్ధతు ఇచ్చాయి.
Tags; Osmania University overturned in four and a half years

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *