OTP shows gas‌ cylinder

ఓటీపీ చూపిస్తేనే గ్యాస్‌ సిలిండర్‌

Date:17/10/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్ల డెలివరీలో అక్రమాలకు చెక్‌ పెట్టడానికి ఆయా కంపెనీలు సన్నద్ధమయ్యాయి. మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టనున్నాయి. నవంబరు 1 నుంచి ఓటీపీ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురానున్నాయి. డెలివరీ అథెంటికేషన్‌ కోడ్‌(డీఏసీ) సిస్టంగా పిలుస్తున్న ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా 100 స్మార్ట్‌ సిటీల్లో తొలుత అమలు చేయనున్నాయి.నూతన విధానంలో.. గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా కంపెనీ వద్ద రిజిస్టరైన వినియోగదారుడి సెల్‌ఫోన్‌ నెంబరుకు ఒక ఓటీపీ వస్తుంది. దానిని డెలివరీ బాయ్‌కి చూపిస్తే.. నమోదు చేసుకుని సిలిండర్‌ను అందజేస్తారు. ఒకవేళ ఫోన్‌ నెంబరు అప్‌డేట్‌ కాకపోతే డెలివరీ బాయ్‌ అప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తారు.

జ‌గ‌న్ అండ్ కో ప్లాన్ స‌క్సెస్ అవుతుందా..?

Tags: OTP shows gas‌ cylinder

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *