హైద్రాబాద్ లో మరో అమృతరావు

Date:25/09/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

మిర్యాలగూడ ప్రణయ్ హత్య.. మారుతీరావు ఆత్మహత్య చూసైనా ఆ కసాయి తండ్రికి జాలి కలగలేదు. మరో మారుతీరావుగా మారి కూతురి ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని దారుణంగా హత్య
చేయించాడు. తన సోదరులు, బావమరుదులతో కలసి అతి కిరాతకంగా అల్లుడిని అంతమొందించారు. మాట్లాడదామని పిలిచి కారులో తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. నమ్మి వెళ్లిన
దంపతులు ప్రమాదాన్ని ఊహించి కారులో నుంచి దూకేసి తప్పించుకునే ప్రయత్నం చేసినా ఘాతకులు విడిచిపెట్టలేదు. వెంటాడి కూతురి భర్తని కారులో పడేసి తీసుకెళ్లి కిరాతకంగా చంపేశారు.
హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన హేమంత్ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.చందానగర్‌కి చెందిన హేమంత్ నాలుగు నెలల కిందట అవంతిని ప్రేమ వివాహం
చేసుకున్నాడు. హేమంత్ స్థితిమంతుడు కాకపోవడంతో అమ్మాయి తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేదని తెలుస్తోంది. అయినా పెద్దలను ఎదిరించి ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

 

వివాహానంతరం అతన్ని వదిలి వచ్చేయాలని ఆమె కుటుంబ సభ్యులు పదేపదే ఒత్తిడి చేసినట్లు సమాచారం. నాలుగు నెలలు గడచిపోవడంతో తమపై కోపం తగ్గిపోయి ఉంటుందని కూతురు
భావించింది.కుటుంబ సభ్యులు మాట్లాడదామని పిలవడంతో నమ్మి వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్నారు. మూడు కార్లలో వచ్చి కుటుంబ సభ్యులు నవ దంపతులను గచ్చిబౌలిలో ఎక్కించుకుని
తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఓఆర్ఆర్ వద్ద అప్రమత్తమైన దంపతులు కారులో నుంచి దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో హేమంత్‌ని అవంతి మేనమామ యుగంధర్ వెంటాడి
పట్టుకుని కారులో పడేసి తీసుకెళ్లాడు. మేనకోడలి భర్తని దారుణంగా చంపేసి సంగారెడ్డి జిల్లా కిష్టాయిగూడెం సమీపంలోని చెట్లపొదల్లో పడేసి పరారయ్యాడు. ఈ కేసులో అవంతి తండ్రి లక్ష్మా రెడ్డి, తల్లి
అర్చన, మేనమామ యుగంధర్‌దే ప్రధాన పాత్రగా పోలీసులు భావిస్తున్నారు.

 

 బుల్లితెరపై బాలు సంచలనం

Tags:Otro Amritarao en Hyderabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *