పుంగనూరులో రుణ విముక్తులను చేయడమే ఓటిఎస్‌ లక్ష్యం- చైర్మన్‌ అలీమ్‌బాషా.

పుంగనూరు ముచ్చట్లు:

ఏళ్ల తరబడి కట్టుకున్న ఇంటికి రుణాలు చెల్లించలేక అవస్థలు పడుతున్న పేద ప్రజలను రుణవిముక్తుల చేయడమే ఓటి ఎస్‌ లక్ష్యమని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. గురువారం పట్టణంలోని 17వ వార్డులో జగనన్న శాశ్వత భూహక్కు పత్రాలను పంపిణీ చేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాలను ఆదుకోవడం జరిగిందన్నారు. నవరత్నాల పథకాలను పేద ప్రజలకు అందజేసి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి దక్కిందన్నారు. ప్రతి ఒక్కరు వైఎస్సార్‌సీపీకి రుణపడి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ రెడ్డెమ్మ, పార్టీ నాయకులు కిషోర్‌, ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: OTS aims to do debt relief in Punganur – Chairman Aleem Basha.

Leave A Reply

Your email address will not be published.